Posted in

సెంట్రల్​ బ్యాంక్​ ఆఫ్​ ఇండియాలో 4500 పోస్టులు

Spread the love

సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (Central Bank Of India) అప్రెంటిస్ పోస్టుల భర్తీకి భారీ నోటిఫికేషన్​ విడుదల చేసింది. ఈ రిక్రూట్​మెంట్​ ద్వారా మొత్తం 4500 అప్రెంటిస్​ పోస్టులను భర్తీ చేయనుంది. ఏదైనా డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు ఈ పోస్టులకు అర్హులు. అర్హతలున్న అభ్యర్థులు ఆన్​లైన్​లో దరఖాస్తు చేసుకోవాలి. జూలై మొదటి వారంలో ఆన్లైన్ ద్వారా ఈ పరీక్ష నిర్వహిస్తారు. అర్హులైన అభ్యర్థులు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అధికారిక వెబ్ సైట్ centralbankofindia.co.in

అభ్యర్థుల వయోపరిమితి 20 నుంచి 28 ఏళ్ల మధ్య ఉండాలి. నాట్స్ పోర్టల్ లో రిజిస్టర్ అయిన అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.

బీఎఫ్ఎస్ఐ ఎస్ఎస్సీ నిర్వహించే ఆన్లైన్ ఎగ్జామినేషన్, టెస్ట్ ఆఫ్ లోకల్ లాంగ్వేజ్ ఆఫ్ స్టేట్ ద్వారా ఎంపిక ప్రక్రియ ఉంటుంది. పరీక్షలో అడిగే మొత్తం ప్రశ్నల సంఖ్య 100, గరిష్ఠ మార్కులు 100. ఆబ్జెక్టివ్ పరీక్షల్లో తప్పు సమాధానాలకు నెగెటివ్ మార్కులు ఉండవు. ట్రైనింగ్ సీట్లకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు తమ రాష్ట్రంలోని స్థానిక భాషలో ప్రావీణ్యం (చదవడం, రాయడం, మాట్లాడటం మరియు అవగాహన) కలిగి ఉండాలి.

పరీక్షలో ఉత్తీర్ణులైన వారికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. ఆ తరువాత మెరిట్ లిస్ట్ ఆధారంగా ఎంగేజ్ మెంట్ కు అనువైన అభ్యర్థులకు ప్రభుత్వ అప్రెంటిస్ షిప్ పోర్టల్స్ ద్వారా డిజిటల్ అప్రెంటిస్ షిప్ కాంట్రాక్టులు జారీ చేస్తారు.

దరఖాస్తు ఫీజు పీడబ్ల్యూబీడీ కేటగిరీ అభ్యర్థులకు రూ. 400 +జీఎస్టీ. షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు, మహిళా అభ్యర్థులు, ఈడబ్ల్యూఎస్ కేటగిరీ అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు రూ.600+ జీఎస్టీ, ఇతర అభ్యర్థులందరికీ రూ.800+ జీఎస్టీ. ఆన్లైన్ విధానంలో ఫీజు చెల్లించాలి.