Posted in

ఢిల్లీలో ప్రముఖ పాన్ మసాలా వ్యాపారి కోడలు ఆత్మహత్య

కమల్ పాన్ మసాలా ఓనర్ కోడలు
Spread the love

ఢిల్లీలో ప్రముఖ వ్యాపారి కమల పసంద్ పాన్ మసాలా యజమాని కమల్ కిషోర్ కోడలు దీప్తి చౌరాసియా (40) ఢిల్లీలోని వసంత్ విహార్లో ఆత్మహత్య చేసుకున్నారు. 2010లో ఆమెకు కమల్ కిషోర్ కుమారుడు హరీత్ చౌరాసియాతో వివాహమైంది, వారికి ఇద్దరు సంతానం ఉన్నారు. మంగళవారం సాయంత్రం దీప్తి ఇంట్లో ఉరివేసుకున్నారు. ఆమె రాసిన సూసైడ్ నోట్లో భర్తతో వివాదమే మరణానికి కారణమని పేర్కొన్నారు.

సూసైడ్ నోట్లో ఏముందంటే: హరీప్రీత్ రెండో వివాహం చేసుకున్నాడని దీప్తి ఆరోపించింది. ఇటీవలే దక్షిణ భారత్కు చెందిన ఒక సినీ హీరోయిన్ను పెళ్లి చేసుకున్నట్లు పేర్కొంది. భర్త రెండో పెళ్లి చేసుకున్న దగ్గర నుంచి కుటుంబంలో వివాదం చెలరేగినట్లుగా పోలీసులు భావిస్తున్నారు. ఆ దిశగా దర్యాప్తు చేస్తున్నారు.

పాన్ మసాలా: చౌరాసియా కుటుంబం పాన్ మసాలా వ్యాపారంలో ప్రసిద్ధి చెందింది. కమల్ కిషోర్ అతని తండ్రి తో కలిసి కమలా పసంద్ బ్రాండ్ను స్థాపించారు. కాంత్ దాదాపు నాలుగు దశాబ్దాల క్రితం కాన్పూర్లో పాన్ మసాలాను అమ్మడం ప్రారంభించారు.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది.)