ప్రపంచ దిగ్గజ ప్రముఖ ఫుట్‌బాల్ ఆటగాడు లియోనల్ మెస్సీ నవంబర్‌లో భారత్ కు రానున్నట్లు కేరళ క్రీడాశాఖ మంత్రి వి.అబ్దుహ్మాన్ తెలిపారు. మెస్సీతోపాటు అర్జెంటీనా జట్టు మొత్తం కేరళకు వస్తుందని ఆయన ప్రకటించారు. తిరుప్పూర్ గ్రీన్ ఫీల్డ్ స్టేడియంలో జరిగే ఓ ఫ్రెండ్లీ మ్యాచులో అర్జెంటీనా తలపడనున్నట్లు పేర్కొన్నారు. కాగా అదే సమయంలో ముంబైలోని వాంఖడే స్టేడియంలో మెస్సీ క్రికెట్ కూడా ఆడతారని వార్తలు వస్తున్నాయి.
నవంబర్‌లో భారత్ కు లియోనల్ మెస్సీ!