నిరుద్యోగులకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ (RRB) గుడ్‌న్యూస్ చెప్పింది. దేశవ్యాప్తంగా వివిధ జోన్లలో ఖాళీగా ఉన్న టెక్నీషియన్ పోస్టులను భర్తీ చేసేందుకు జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది.
RRB Technician: నిరుద్యోగులకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ (RRB) గుడ్‌న్యూస్ చెప్పింది. దేశవ్యాప్తంగా వివిధ జోన్లలో ఖాళీగా ఉన్న టెక్నీషియన్ పోస్టులను భర్తీ చేసేందుకు జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్‌లో 2025-26 సైకిల్‌కి సంబంధించి 6,180 ఖాళీలను ఫిల్ చేయనుంది. అయితే డీటైల్డ్ నోటిఫికేషన్‌ను RRB జూన్ 27న రిలీజ్ చేయనుంది. ఈ రిక్రూట్‌మెంట్‌లో విభాగాల వారీగా ఖాళీలు, అర్హతలు, అప్లికేషన్ ప్రాసెస్, జీతం.. వంటి వివరాలు తెలుసుకుందాం.
ఖాళీల వివరాలు
- టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్: 180 పోస్టులు
- టెక్నీషియన్ గ్రేడ్ 3: 6,000 పోస్టులు
అర్హత :
టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్
అర్హత: ఫిజిక్స్, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ లేదా ఇన్స్ట్రుమెంటేషన్‌లో బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ (బీఎస్సీ); లేదా సంబంధిత విభాగాల్లో ఇంజనీరింగ్‌లో డిప్లొమా/డిగ్రీ.
టెక్నీషియన్ గ్రేడ్ 3
విద్యార్హత: 10వ తరగతి (SSLC/మెట్రిక్యులేషన్)తో పాటు ITI లేదా ఫౌండ్రీమ్యాన్, మోల్డర్, ప్యాటర్న్ మేకర్ లేదా ఫోర్జర్ మరియు హీట్ ట్రీటర్ వంటి నిర్దిష్ట ట్రేడ్‌లలో అప్రెంటిస్‌షిప్.
వయస్సు : (జూలై 1, 2025 నాటికి):
గ్రేడ్ 1 సిగ్నల్: 18 నుండి 33 సంవత్సరాలు
గ్రేడ్ 3: 18 నుండి 30 సంవత్సరాలు
ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వ్డ్ కేటగిరీలకు వయో సడలింపులు వర్తిస్తాయి.
దరఖాస్తు రుసుము
SC/ST, మాజీ సైనికులు, PwD, మహిళలు, ట్రాన్స్‌జెండర్లు, మైనారిటీలు మరియు ఆర్థికంగా వెనుకబడిన తరగతి: ₹250 (CBTలో హాజరైన తర్వాత పూర్తిగా వాపసు ఇవ్వబడుతుంది)
అన్ని ఇతర వర్గాలు: ₹500 (CBTలో హాజరైన తర్వాత ₹400 తిరిగి చెల్లించబడుతుంది)
జీతం
7వ సెంట్రల్ పే కమిషన్ (CPC) ప్రకారం.. టెక్నిషియన్ గ్రేడ్ 1 సిగ్నల్ పోస్టుకు సెలక్ట్ అయిన వారికి నెలకు రూ.29,200 ఇనిషియల్ పే అందుతుంది. టెక్నిషియన్ గ్రేడ్ 3 వారికి నెలకు రూ.19,900 ఉంటుంది. DA, HRA, TA వంటి అదనపు అలవెన్స్‌లు వర్తిస్తాయి.
ఎంపిక ప్రక్రియ :
అభ్యర్థులు దరఖాస్తు చేసుకునే ముందు విద్యా అర్హతలు మరియు వయో పరిమితులు వంటి అర్హత ప్రమాణాలను జాగ్రత్తగా సమీక్షించాలని సూచించారు. ఎంపిక ప్రక్రియలో రాత పరీక్ష ఉంటుంది, ఆ తర్వాత విజయవంతమైన దరఖాస్తుదారులకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. ఈ నియామక ప్రక్రియ భారతీయ రైల్వేలు తన సాంకేతిక సిబ్బందిని బలోపేతం చేయడానికి మరియు కార్యకలాపాల విస్తరణకు మద్దతు ఇవ్వడానికి కొనసాగుతున్న ప్రయత్నాలలో భాగం.
దరఖాస్తు ప్రక్రియ:
ఈ ఉద్యోగాలకు అప్లికేషన్ ప్రాసెస్ పూర్తిగా ఆన్‌లైన్‌లోనే జరుగుతుంది. అభ్యర్థులు RRB అధికారిక పోర్టల్ rrbapply.gov.in లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. జోన్ల వారీగా సైతం అప్లై చేసుకోవచ్చు. జూన్ 28 నుంచి జులై 28, రాత్రి 11:59 గంటల వరకు అప్లై చేసుకోవచ్చు. ఉదాహరణకు, అహ్మదాబాద్ జోన్ పరిధిలోని వారు rrbahmedabad.gov.in వెబ్‌సైట్‌లో; ముంబై జోన్ అభ్యర్థులు rrbmumbai.gov.in , చెన్నై జోన్‌కి చెందిన వారు rrbchennai.gov.in వంటి వెబ్‌సైట్లలోనూ అప్లై చేసుకోవచ్చు.