మునగ ఆకులు చేసే మేలు తెలిస్తే ఆశ్చర్యపోతారు

మునగ ఆకు తో చేసే మేలు తెలిస్తే ఆశ్చర్యపోతారు. మునగకాయలు నిత్యం మనం తినే ఆహారమే, మునగకాయలు తినడం వలన ఆరోగ్యానికి చాలా మంచిదని అందరికీ తెలుసు. అయితే మునగ కాయలే కాకుండా వాటి ఆకుల లోను అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని పరిశోధనల్లో వెల్లడైంది. మరి వాటి వల్ల కలిగే ఆ ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి, అనేది మనం ఇప్పుడు చూద్దాం. మునగాకులో విటమిన్ ఏ, విటమిన్ సి, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. అలాగే క్యాల్షియం, పాస్ఫరస్, ఐరన్, కూడా పుష్కలంగా ఉంటాయి. ఇందులో విటమిన్స్ అమినో యాసిడ్స్, మినరల్స్ ,సమృద్ధిగా ఉంటాయి. అందుకే కళ్ళ వ్యాధులకు సంబంధించిన మెడిసిన్ లో మునగ ఆకును వాడతారు.

మహిళలు రోజుకు ఏడు గ్రాముల మునగాకు పొడి మూడు నెలల పాటు రెగ్యులర్ గా తీసుకుంటే 13.5 శాతం బ్లడ్లో షుగర్ లెవెల్స్ ను తగ్గాయని పరిశోధనల్లో తేలింది. ఎందుకంటే మునగాకు లో ఉండే క్లోరోజనిక్ యాసిడ్ ద్వారా బ్లడ్ షుగర్ లెవల్స్ కంట్రోల్ అవుతుందని వైద్యులు చెబుతున్నారు. మునగ ఆకుల రసాన్ని పాలలో కలిపి పిల్లలకు అందిస్తే, వారి ఎముకలు బలంగా తయారవుతాయి. ఇంకా గర్భిణీలు బాలింతలకు ఇస్తే వారికి అవసరమైన క్యాల్షియం, ఐరన్ విటమిన్లు పుష్కలంగా లభిస్తాయి. అప్పుడు తల్లుల తో పాటు పాలు తాగే పిల్లలు కూడా ఆరోగ్యంగా ఉంటారు. అంతే కాకుండా పాలిచ్చే తల్లులకు ఇస్తే పాలు పెరుగుతాయి.

గుప్పెడు మునగాకు లను 100 మిల్లీలీటర్ల నీటిలో వేసి ఐదు నిమిషాల పాటు ఆ నీటిని కాచి చల్లారిన నివ్వాలి. వాటిలో కొంచెం ఉప్పు, మిరియాల పొడి, నిమ్మరసం ,కలిపి తాగితే ఆస్తమా, టీబీ , దగ్గు, తగ్గుతాయి మునగాకు రసం ఒక చెంచా తీసుకుని, దానిని గ్లాస్ కొబ్బరి నీళ్ళలో కలిపి కాస్తంత తేనె, కలిపి తాగితే విరోచనాలు తగ్గిపోతాయి. కాల్షియం లోపం ని ఎదుర్కొనే మహిళలకు మునగాకు వరప్రసాదం ఎందుకంటే వారు విరివిగా మునగాకును ఏదో ఒక రూపంలో ఉపయోగిస్తూ ఉంటే, వారిలో క్యాల్షియం పెరుగుతూ ఉంటుంది…

Add comment

Your Header Sidebar area is currently empty. Hurry up and add some widgets.