తలస్నానం గురించి నిజాలు!!

తలమీద నీళ్ళు పోసుకొని స్నానం చేయడాన్ని తలంటుకోవడం, అనో, తలంటి పోసుకోవడం అనో మనం అంటున్నాం. ఒక్క మాటలో చెప్పాలంటే కుంకుడు కాయతో గానీ, షాంపుతో గానీ, శీకాయతో గానీ తలారా స్నానం చేయడాన్ని తలంటి పోసుకోవడం అని మనం వ్యవహరిస్తున్నాం. కానీ తలంటుకోవడం అంటే ఏమిటో తెలుసా?? తలని నూనెతో అంటాలి! మాడు మీద నూనె పోసి బాగా మర్దన చేయడాన్ని తలంటడం’ అంటారు. నిజంగా మనం తలంటి పోసుకొంటున్నప్పుడు ఇలా నూనెతో తలంటుకుంటున్నామా? చాలా మంది తలంటుకోకుండానే తలంటి పోసుకుంటున్నారన్నది వాస్తవం!

నలుగు పెట్టుకుంటే మలినాలు పోతాయి!
నూనెతో తలని అంటి, స్నానం చేయడాన్ని అభ్యంగన స్నానం అంటారు. ఇదే నిజమైన ఆయిల్ బాత్! నూనెని తలతోపాటు వొళ్ళంతా పట్టించుకొని, బాగా మర్దన చేయించుకొని నలుగుపెట్టుకుని, అది ఆరాక వలిచి, అప్పుడు స్నానం చెయ్యాలి.. నలుగు పెట్టుకుంటే వొళ్ళు తగ్గుతుంది. జిడ్డు పోతుంది. శరీరకాంతి పెరుగుతుంది. కనీసం వారానికి ఒకసారయినా ఇలా అభ్యంగన స్నానం చేస్తే ఆరోగ్యం పదిలంగా వుంటుంది. రోజూ అయితే ఇంక తిరుగేముంది!

మెదడు వ్యాధులన్నింటికి పరిష్కారం ఆముదంతో తలంటు!
ఆముదాన్ని తలకి, ఒంటికి పట్టించుకొని స్నానం చేస్తే షుగర్ వ్యాధి, పక్షవాత వ్యాధి, నడుంనొప్పి, కీళ్ళవాతం, మైగ్రేన్ తలనొప్పి మొదలైన వ్యాధులన్నింటిన్నిటి నుండి ఉపశమనం ఉంటుంది. వేడి తగ్గిస్తుంది. మెదడుకు సంబంధించిన జబ్బులన్నింటిలోనూ ఆముదం అంటి తలంటి పోయడం ఉత్తమ మార్గం.!

స్నానానికి ముందు కొబ్బరినూనె పట్టించుకోవడం వల్ల చర్మం కాంతి వంతంగా ఉంటుంది. కొబ్బరినూనెతో గాని, నువ్వులనూనెతో గానీ, అభ్యంగన స్నానం చేస్తే చర్మ వ్యాధులు తగ్గుతాయి. సుఖంగా నిద్రపడ్తుంది. శరీరం తేలికగా వుంటుంది. పిచ్చి కలలు రావడం తగ్గుతుంది. తలంటి పోసుకునేప్పుడే కాదు మామూలు స్నానం చేసేటప్పుడు కూడా తైలమర్దనం మంచిదే.

Add comment

Your Header Sidebar area is currently empty. Hurry up and add some widgets.