ఒక ఇంట్లో మూడు పొయ్యిలు ఉండవచ్చా .

మనకు ఉన్నటువంటి సందేహాలలో ఒక సందేహం. మనకు ఉన్నటువంటి సమస్యలలో ఒక సమస్య, ఒక ఇంట్లో మూడు పొయ్యిలు ఉండవచ్చా, ఒక స్టవ్వు కి మూడు బర్నర్లు ఉంటే కనుక, దానిని ఇంట్లో పెట్టుకోవచ్చా? 2 బర్నర్ లో ఉన్న స్టవ్వు ఒక ఇండక్షన్ స్టవ్ అంటే 3 ఉండవచ్చా? మా ఇంట్లో రెండు బర్నర్ ఉన్నటువంటి స్టవ్ ఒకటి మైక్రోవేవ్ ఓవెన్ ఒకటి ఉంది అది లెక్క లోకి పోయే లెక్కలోకి వస్తుందా అని మూడు ఉన్నాయి కాబట్టి ఉండవచ్చా?

ఏది ఎంతవరకు పాటించాలో అంతవరకే పాటించాలి, మూడు పొయ్యిలు ఇంట్లో ఉండొచ్చా ఉండకూడదా, అనే ఎటువంటి సమస్య మన ఒక్కసారి ఆలోచన చేసినట్లయితే, గ్యాస్ స్టవ్ కి 3 బర్నర్ లో ఉండవచ్చా అని అడిగారు. శాస్త్రాలు రాసే సమయానికి గ్యాస్ స్టవ్ లు అసలు ఉన్నాయా, అనేటువంటిది మనం ఆలోచన చేస్తే ఇప్పుడు, మనం పాటించేటువంటిది అనేది మనకు అర్థమైపోతుంది. కాబట్టి శాస్త్రాలు రాసేటటువంటి సమయానికి గాడిపొయ్యి తప్ప, ఈ పొయ్యిలు లేవు, అసలు వాళ్ళు ఎందుకు చెప్పారంటే ఉండకూడదని, మూడు పొయ్యిలు ఉండకూడదని అంటే, ఒక ఇంట్లో తండ్రి, ఇద్దరు కొడుకులు, కనుక ఉంటే ముగ్గురు వేరువేరుగా వంటలు చేసుకొని, మా వంట మాదే అనే కొడుకు లు కొట్టుకొని చావకుండా, అందరూ కలిసి ఒకే వంట చేసుకోవాలి అనే ఉద్దేశంతో మూడు పొయ్యిలు పెట్టకండి అని చెప్పారు..

అంతేతప్ప ఒక స్టవ్ కి మూడు బర్నర్లు ఉంటే అది ఇంట్లో పెట్టకూడదు, గృహప్రవేశం రోజున మూడు పొయ్యిలు పెడితే ముక్కలు చెక్కలు అవుతుంది, అనేటువంటి మాట ఏదైతే ఉందో దాన్ని తీసి పక్కన పెట్టండి. మూడు చాలా పవిత్రమైనటువంటి సంకేతాలు యదార్థానికి త్రీ ,7 అనేటువంటి ది మన హిందూ ధర్మంలో మన వాళ్లు, మూడు అన్న ఏడు అన్న భయపడతారు కదా, యథార్థానికి 3 అంటే త్రిమూర్తులు త్రిమూర్తులు వాళ్లు ముగ్గురు అమ్మలు, పెళ్లి లో వేసే టటువంటి ముళ్ళు మూడు ముళ్ళు కాబట్టి, దాని గురించి మీరు ఏమి భయపడాల్సిన పని లేకుండా, మూడు పొయ్యిలు కాకపోతే 7 బర్నర్లు స్టవ్ ఉన్నటువంటి కూడా కొనుక్కుని, ఇంట్లో పెట్టుకోవచ్చు ఎలాంటి సందేహం అవసరం లేదు, కాబట్టి మనం ఏది ఎంతవరకు పాటించాలో అంతవరకే పాటిద్దాం…

Add comment

Your Header Sidebar area is currently empty. Hurry up and add some widgets.